| స్వర్ణయుగం |
|
2004 అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పై ఎంతో నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం చేకూర్చి పెట్టారు. ప్రజల ఆశలను వమ్ము చేయని డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే తనది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని నిరూపించేందుకు ఆహర్నిశలు కృషి చేస్తున్నారు. 'కష్టే ఫలి ' అని పెద్దలు ఊరికే అనలేదు. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి దార్శనికతకు ప్రతీకగా రాష్ట్రాన్ని 'హరితాంద్రప్రదేశ్' గా తీర్చిదిద్దడానికి రూపుదిద్దుకున్న పథకాలు, ప్రణాళికలు, విధానపర నిర్ణయాలకు ఎ ఐ సి సి అధ్యక్షురాలు, యుపిఏ ఛైర్ పర్సన్ శ్రీమతి సోనియాగాంధీ, ప్రదానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆశీస్సులతో పాటు రాష్ట్ర ప్రజల అండదండలు లభించడంతో నాలుగున్నరేళ్ళ రాజశేఖరుడి పాలనలో రాష్ట్రంలో అన్ని రంగాలలో అభివృద్ధి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది . సమాజంలో అన్ని వర్గాల వారికి ప్రభుత్వ పరంగా అమలవుతున్న పథకాలు ఏదో విధంగా ప్రయొజనం చేకూరుస్తుండగా, మారుతున్న ప్రజల అవసరాలను గుర్తించి, ఆ మేరకు వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల హామీలతో నిమిత్తం లేకుండా సరికొత్త పథకాలను, కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. పేద ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం పొందిన దివంగత ప్రధాని ఇందిరాగాంధీ విధానాలను అమలు చేస్తూ, ఎన్నికలలో ఇచ్చిన ప్రధాన హామీకి అనుగుణంగా ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రం లో ' ఇందిరమ్మ పాలన ' అమలు చేస్తున్నారు. పేదల పెన్నిధి, దళితుల ఆశాజ్యోతి, అట్టడుగు, బడుగు వర్గాల ఆరాధ్య దైవం ఇందిరాగాంధీ విధానాల స్ఫూర్తితో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ సత్ఫలితాలనిస్తున్నాయి. |